హనుమాన్ అంటూ ఎలాంటి అంచనాలు లేకుండా పెద్ద హీరోలతో పోటీ పడి సంక్రాంతి విన్నర్ గానే కాదు.. పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టిన ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం ఓటీటీలోనే కాదు.. బుల్లితెర మీద కూడా సత్తా చాటింది. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ని అనౌన్స్ చెయ్యడమే కాకుండా.. దానిని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అంటూ ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ చిత్ర స్క్రిప్ట్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.
జై హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ బాలీవూడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో చిత్రానికి కమిట్ అయ్యాడు. రణవీర్ తో ప్రశాంత్ వర్మ చిత్రం జై హనుమాన్ తర్వాత అతి త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భాగంగానే రణవీర్ చిత్రం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. హనుమాన్ సూపర్ హీరో బేసెడ్ మూవీ. ఇప్పుడు రణవీర్ తో అదే తరహాలో ప్రశాంత్ వర్మ ఆ చిత్రాన్ని చేయబోతున్నట్టుగా టాక్.
అయితే ఈ చిత్రానికి ముందుగా రాక్షస అనే టైటిల్ ని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ-రణవీర్ సింగ్ కాంబో చిత్రానికి బ్రహ్మరాక్షస అనే టైటిల్ ని అనుకుంటున్నారట. కథ ఎప్పుడో ఫైనల్ అయిపోయింది. ఈ కథకు, టైటిల్ కి కూడా రణవీర్ కూడా ఓకే చెప్పేశాడు అని తెలుస్తోంది.