చాలామంది అమ్మాయిలు తనకి కాబోయే భర్త విషయంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ చాలా కోరికలు చెబుతారు. తనని బాగా చూసుకోవాలి, తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తన వృత్తిని గౌరవించాలి, తన పెరెంట్స్ ని బాగా చూసుకోవాలీ ఇలా చాలా కోరికలు ఉండడమే కాదు అలాంటి భర్త కోసం కలలు కంటారు.
తాజాగా ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ కూడా ఇలాంటి కోరికలే బయటపెట్టింది. ఆదిపురుష్ సమయంలో ప్రభాస్ తో డేటింగ్ చేస్తుంది అనే రూమర్స్ ని ఎదుర్కున్న కృతి సనన్ తాజాగా తనకు కాబోయే భర్తపై ఎలాంటి అంచనాలు లేవు, అంచనాలు పెట్టుకుంటే నెరవేరవు, అంతేకాకుండా ఒత్తిడి కూడా పెరుగుతుంది అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది.
తనకు కాబోయే భర్తకుండాల్సిన లక్షణాలను బయటపెట్టింది ఈ భామ. రియాలిటీలో బ్రతికే వ్యక్తి అయ్యి ఉండాలి, నన్ను నవ్వించగలగాలి, ఎంతసేపు మాట్లాడుతున్నా బోర్ కొట్టకూడదు, నన్ను, నా వృత్తిని గౌరవంచేవాడు అయ్యి ఉండాలి అంటూ కామన్ లక్షణాలు ఉంటే చాలన్నట్టుగా కృతి సనన్ కాబోయే వాడి గురించి సింపుల్ గా తేల్చేసింది.