పుష్ప రాజ్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ కి బ్రేకిచ్చి తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసేందుకు నంద్యాల వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ని చూసేందుకు ఎంతోమంది అభిమానులు, మూవీ లవర్స్ పోటెత్తారు.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తో కాసేపు మాట్లాడు ప్రజలకి, అభిమానులకి అభివాదం చేసిన అల్లు అర్జున్ తన స్నేహితుడు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకి సంబంధం లేదు, కానీ తన స్నేహితుడుని కలిసి సపోర్ట్ చేసేందుకే తాను నంద్యాల వచ్చినట్లుగా అల్లు అర్జున్ చెప్పాడు.
అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కి పోలీసులు షాకిచ్చారు. ఆయనపై కేసు నమోదు అయ్యింది. అనుమతి లేకుండా నంద్యాల పరిసర ప్రాంతాల్లో జన సమీకరణ చేశారంటూ రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ తో సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద ఫిర్యాదు చెయ్యడంతో ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర రెడ్డిపై కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేశారు.