కల్కి 2898 AD చిత్రానికి సంబందించిన సిజి వర్క్ ఇంకా పూర్తి కాలేదా అంటే.. అవునే అన్నిస్తుంది. నిర్మాత స్వప్న దత్ పోస్ట్ చూస్తుంటే. మే 9 న కల్కి ని విడుదల చేస్తామని అన్నప్పటికీ.. ఎలక్షన్స్ కారణంగా దానిని జూన్ 27 కి పోస్ట్ పోన్ చేసారు. అయితే కేవలం మే లో ఎలక్షన్స్ కారణమే కాదు.. కల్కికి సంబందించిన గ్రాఫిక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు అనిపిస్తుంది.
కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ వైఫ్, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తె అయిన స్వప్న దత్ ఇన్స్టా స్టోరీ వైరల్ గా మారింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తో మాట్లాడుతున్నట్టుగా ఫన్ కన్వర్జేషన్ ని ఆ స్టోరీలో రాసుకొచ్చింది. సీజీ కి వర్క్ చేస్తున్న వారు అంతా హైదరాబాద్ నుంచి ఎలెక్షన్స్ కి వెళ్లిపోయారు అని దర్శకుడు అంటే స్వప్న దత్ ఎన్నికల విషయమై ఎవరు గెలుస్తారు అని అడగగా..
దానికి ఎవరు గెలిస్తే నాకెందుకండి నా షాట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావాలి అంటూ నాగ్ అశ్విన్ చెప్పడం చూస్తే కల్కికి సంబందించిన సిజి వర్క్ ఇంకా పెండింగ్ లో ఉందనిపిస్తుంది. మరి ఈ ఎన్నికల హడావిడి ముగిస్తే కల్కి ప్రమోషన్స్ మొదలవుతాయని అందరూ ఎదురు చూస్తుంటే.. ఇంకా ఈ సిజి వర్క్ గోలేమిటో అనేది ప్రభాస్ ఫాన్స్ కి అర్ధం కావడం లేదు.