మాస్ రాజా రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు.. బిగ్ బాస్ గెలుపు కూడా నాకు అక్కర్లేదు అన్న అమర్ దీప్ కి ఫైనల్ గా మాస్ రాజా రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా నా డ్రీమ్ నిజమైంది రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చింది, నా దేవుడు నీవేనయ్యా, Finally mass maharaja ⭐️ 🔥🔥 Finally my dream come true ❤️ #raviteja #massmaharaja love ❤️ u ana 🔥🔥🙏 Naa Deavudu nveanayaaaaa🔥🔥🔥 Fan boy moments chapaleanu anthaa pichiiii naku ❤️🙏 అంటూ అమర్ దీప్ రవితేజ తో కలిసి ఉన్న పిక్ తో హ్యాపీ న్యూస్ ని సోషల్ మీడియా ద్వారా ఆనందంగా పంచుకున్నాడు.
సీరియల్ ఆర్టిస్ట్ అయిన అమర్ దీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాక అతని అమాయకత్వం అందరికి నచ్చింది. అందులోను శివాజీ లాంటి నటులు అమర్ దీప్ ని టార్గెట్ చెయ్యడం బుల్లితెర ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో తరచూ గొడవ పడుతూ.. తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్నాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో ఉన్న అమర్ దీప్ ని నాగార్జున తనకిష్టమైన హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే టైటిల్ విన్నర్ నుంచి తప్పుకుంటావా అని అడగ్గానే.. హా సర్.. నాకు బిగ్ బాస్ టైటిల్ వద్దు, నాకు రవితేజ సినిమాలో ఛాన్స్ మాత్రమే కావాలి అన్న అమర్ దీప్ ని అక్కడే స్టేజ్ మీదున్న రవితేజ.. వద్దొద్దు.. ఇక్కడ 105 రోజులు కష్టపడి ఆడావు, నా సినిమా ఛాన్స్ కోసం అది ఒదులుకోకు, నీకు ఖచ్చితంగా నా అప్ కమింగ్ చిత్రంలో ఛాన్స్ ఇస్తా అంటూ ప్రామిస్ చేసాడు. అన్నట్టుగానే రవితేజ అమర్ దీప్ కి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు.