రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ గా ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. ఈరోజు ఉన్నట్టుండి. వైసీపీ అభ్యర్థి కోసం ఏపీ కి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ బహిరంగంగానే నంద్యాల ఎమ్యెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా ఏపీకి వెళ్లడం మెగా అభిమానులతో పాటుగా పవన్ ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే అల్లు అర్జున్ మాత్రం నాకు పార్టీతో సంబంధం లేదు.. నేను శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజెయ్యడానికే ఆయన ఇంటికి వచ్చాను.. నాకు దగ్గరి మిత్రుడు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి.. నాకు అతను ఏ పార్టీలో ఉన్నా సంబంధం లేదు, నాకు మిత్రుడు కాబట్టి ప్రచారానికి వచ్చా..
అతని కోసం గతంలో ట్వీట్ చేశా.. తర్వాత నువ్వు పోటీ చేస్తే బావుంటుంది అని.. అప్పుడే అనుకున్నా ఈసారి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి పోటీ చేస్తే ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపాలని అందుకే నంద్యాల వచ్చాను, మనసు కి నచ్చితే చేస్తాను Brother...! This is purely my call, నా మనసు కి నచ్చినోళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీ లో ఉన్నా వెళ్లి సపోర్ట్ చేస్తా అంటూ అల్లు అర్జున్ తన నంద్యాల రాకపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.