ఏపీ ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికే సమయం ఆసనమైంది. ఈరోజు ఐదు గంటలతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. అయితే ఏపీ లో ప్రచారానికి చివరి రోజు కావడమే కాదు.. అక్కడఈరోజు ఆసక్తికర పరిణామాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఈరోజు ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్, ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు పార్టీల కోసం ప్రచారానికి రావడమే ఆశ్చర్యం అనిపించేలా కనిపిస్తుంది. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరంతా రెండు నెలలుగా ప్రజల్లో తిరుగుతూన్నారు.
కానీ ఈరోజు మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్, జనసేన కోసం పిఠాపురం వెళ్ళాడు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న రామ్ చరణ్ అక్కడ కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయం సందర్శించనున్నారు. రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ సతీమణి సురేఖ, అల్లు అరవింద్ కూడా ఉన్నారు.
మరోపక్క పుష్ప చిత్రం పాన్ ఇండియా స్టార్ గా, నేషనల్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ రెడ్డిని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.
మరి ఒకేరోజు ఇద్దరు స్టార్ మరియు మెగా ఫ్యామిలీ హీరోలు వేర్వేరు పార్టీల అభ్యర్థుల కోసం ప్రచారం చెయ్యడం ఇంట్రెస్టింగ్ అయిన విషయమే కదా.!