పవన్ కళ్యాణ్ నా దేవుడు, నేను ఆయనకి అభిమానిని, అందుకే నా సినిమాల్లో ఆయన సినిమాల్లో ఉన్న సీన్స్ ని ఇమిటేట్ చేస్తాను అది నా సెంటిమెంట్ అని చెప్పుకునే నితిన్.. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే దేవుడు.. రాజకీయాల్లో కాదు అంటూ చెప్పకనే చెప్పేసాడు. అంటే పవన్ కళ్యాణ్ కి ఆయన పార్టీకి నితిన్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు.
మెగా హీరోలంటే.. పవన్ కళ్యాన్ ఫ్యామిలీ హీరో కాబట్టి సపోర్ట్ చేసారు. మరి నాని ఎవరు. బయట వ్యక్తి. ఆయన పవన్ కళ్యాణ్ కి బహిరంగంగా సపోర్ట్ ప్రకటించారు. మరి పవన్ కళ్యాణ్ పేరుని సెంటిమెంట్ గా వాడుకుని లాభపడిన నితిన్ ఎందుకు పవన్ కి సపోర్ట్ చెయ్యడం లేదో అని పవన్ ఫాన్స్ కూడా కాస్త గుర్రుగానే ఉన్నారు.
మరి నితిన్ రెడ్డి కులస్తుడు కావడంతో నితిన్ ఖచ్చితంగా జగన్ రెడ్డికి, వైసీపీ పార్టీకే వత్తాసు పలుకుతాడు. కానీ బహిరంగంగా అయితే పవన్ నొచ్చుకుంటారు. పవన్ కి సపోర్ట్ చేస్తే అటు వైసీపీ వాళ్ళు నొచ్చుకుంటారు. అందుకే నితిన్ ఎవరి వైపు మాట్లాడకుండా గమ్మునున్నాడనిపిసుంది. కానీ నితిన్ పవన్ కళ్యాణ్ కోసం నిలబడకపోవడం మాత్రం పవన్ ఫాన్స్ ని ఇబ్బందిపెడుతుంది.