ఏపీలో సీఎం స్థాయిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి, ఆయన భార్యల గురించి పదే పదే మాట్లాడడం విడ్డురంగానే ఉంది. జగన్ మాత్రమేనా.. ఆయన మంత్రులు, వైసీపీ నేతలు, నిన్నగాక మొన్న జనసేన టికెట్ దొరక్క వైసీపీ లోకి జంప్ అయిన పోతిన మహేష్ కూడా పవన్ కళ్యాణ్ భార్యలపై, పెళ్లిళ్లపై చేసిన కామెంట్స్ ని చాలామంది తప్పుబట్టారు. మహేష్ ఇంకాస్త ముందుకు వెళ్లి పవన్ మూడో భార్య అన్న లెజెనోవా ని కూడా వదిలేసాడు, లేదంటే పిఠాపురం గృహప్రవేశానికి తీసుకొస్తాడంటూ నీచమైన కామెంట్స్ చేసాడు.
తాజాగా పవన్ కళ్యాణ్.. జగన్ దగ్గర నుంచి మహేష్ వరకు తన భార్య విషయాన్ని లేవనెత్తి నీచమైన కామెంట్స్ చేసిన వారికి సున్నితంగా ఇచ్చిపడేసారు. నేను ఇక్కడికి వచ్చే ముందు నా భార్యకు ఒకటే మాట చెప్పాను, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని త్యాగం చేయాలనేది విదుర నీతి. ఒకవేళ ఈ రాష్ట్రం కోసం మన కుటుంబాన్ని నష్టపోయినా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందాం అని నా భార్యకు చెప్పాను
నా భార్య విదేశీయురాలు.. ఆఖరుకి తనను కూడా తిట్టారు. ఎదుకిలా తిడతారు అని ఆమె చాలాసార్లు అడిగింది.. ఇదంతా రాజకీయం అని ఆమెని నేను క్షమించమని అడిగా.. అంతెకాకుండా ఎలక్షన్ రోజు మే 13 న పిఠాపురం నువ్వు రా.. నీకు అర్ధం అవుద్ది అని చెప్పా.. అంటూ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు.