టిల్లు స్క్వేర్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన లిల్లీ ఉరఫ్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారింది. టిల్లు స్క్వేర్ చిత్రంలో బోల్డ్ గా సిద్దు జొన్నలగడ్డతో రొమాంటిక్ గా రెచ్చిపోయిన అనుపమకు ఆ చిత్రం సక్సెస్ చాలా హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం రెండు హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లో అలాగే యంగ్ హీరోల సినిమాల్లో, తమిళ మూవీస్ లో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. అందులో ఒకటి సమంత బ్యానర్ లో పరదా చిత్రం, బైసన్, లాక్‌డౌన్ అనే చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా వుంది.
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ సరసన తమిళ చిత్రం బైసన్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటు హీరోయిన్ సెంట్రిక్ మూవీస్, అటు యంగ్ హీరోల సినిమాలతో ఓ రెండేళ్లపాటు అనుపమ డైరీ ఫుల్లయ్యింది. అందుకే అనుపమ పరమేశ్వరన్ పారితోషికాన్ని కూడా డబుల్ చేసేసింది అనే టాక్ మొదలైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని ఫాలో అవుతూ.. అనుపమ కెరీర్ లో స్టెప్ వేస్తుంది అని దీన్ని బట్టి అర్ధమవుతుంది.
ఒకప్పుడు ఒక్కో సినిమాకు లక్షల్లో పారితోషికం అందుకున్న అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు ఊహించనంత పెద్ద మొత్తం వసూలు చేస్తోందనే గుసగుస టాలీవుడ్ లో వినిపిస్తోంది. అనుపమ పారితోషికం డబుల్ అనే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ప్రచారంలోకి వచ్చింది. మరి ఈ వార్తలపై అనుపమ ఎలా స్పందిస్తుందో చూడాలి.