Advertisementt

డిజప్పాయింట్ చేసిన మెగాస్టార్

Fri 10th May 2024 03:04 PM
chiranjeevi  డిజప్పాయింట్ చేసిన మెగాస్టార్
A disappointed Megastar డిజప్పాయింట్ చేసిన మెగాస్టార్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానులని అలాగే జనసైనికులని, పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని చాలా డిస్పాయింట్ చేసారు. నిన్న గురువారం సాయంత్రం తన భార్య సురేఖ, కొడుకు చరణ్, కోడలు ఉపాసన, కుమార్తె సుష్మితలతో కలిసి పద్మ విభూషణ్ బిరుదు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాన్స్ ని ఆనందంలో ముంచెత్తారు. కానీ ఇప్పుడు అదే మెగా ఫాన్స్ ని డిజప్పాయింట్ అయ్యేలా చేసారు. 

ఎలా, ఎందుకు అంటే.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కి భారీగా విరాళమివ్వడమే కాదు, వీడియో తో తమ్ముడు కి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని గెలిపించమంటూ అడిగారు. దానితో సినిమా ఇండస్ట్రీలో మరికొంతమంది జనసేన పై స్పందించారు. ఇక మెగాస్టార్ జనసేన తరపున పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తారు అని మీడియాలో తెగ ప్రచారం జరిగింది. 

ఈరోజు మే పది న మెగాస్టార్ చిరు చంద్రబాబు ని కలిసి పిఠాపురం వెళ్లి తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొంటూ క్యాంపెయిన్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో మెగా అభిమానులు, అలాగే జనసేన కార్యకర్తలు, మరికొందరు సినీ ప్రియులు చాలా ఎగ్జైట్ అవుతూ వెయిట్ చేసారు. 

కానీ మెగాస్టార్ చిరంజీవి తాను పిఠాపురం వెళ్లడం లేదు అని స్పష్టం చేశారు. తన తమ్ముడు కళ్యాణ్ బాబు తనని ప్రచారం చెయ్యమని, నన్ను పిఠాపురం రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నేను పిఠాపురం వెళుతున్నట్టుగా మీడియా వారే వార్తలు పెంచి పోషించారు. కళ్యాణ్ బాబు బావుండాలి, తన జీవితంలో అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తాను, తనతో పాటు నేనున్నాను అని చెప్పడానికే వీడియో చేశాను, మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, తను రాజకీయంగా ఎదగాలని మా కుటుంబ సభ్యులందరు మనసా వాచా కోరుకుంటాం.. అంటూ మెగాస్టార్ చిరు పిఠాపురం వెళుతున్నట్టుగా వస్తున్న వార్తలని ఖండించారు. 

దానితో అభిమానులు మాత్రం బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. చిరు ఖచ్చితంగా పిఠాపురం వచ్చి పవన్ కోసం ప్రచారం చేస్తారనుకున్నారు, ఆయన వస్తే పవన్ కళ్యాణ్ కి మెజారిటీ వస్తుంది అని ఆశపడ్డారు. కానీ చిరు రారని తెలిసి వారు ఇప్పుడు డిజప్పాయింట్ అవుతున్నారు. 

A disappointed Megastar:

Chiranjeevi Gives Clarity on His Campaign

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ