Advertisementt

కొడాలిని ఢీ కొడుతున్న కుమారి ఆంటీ!

Fri 10th May 2024 02:28 PM
kumari aunty  కొడాలిని ఢీ కొడుతున్న కుమారి ఆంటీ!
Kumari Aunty Backs TDP Alliance in Gudivada కొడాలిని ఢీ కొడుతున్న కుమారి ఆంటీ!
Advertisement
Ads by CJ

కుమారి ఆంటీ.. గుర్తుందా.. అబ్బే ఈ ఆంటీని ఎలా మరిచిపోతార్లేండి..! ఓవర్ నైట్‌లో సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్ సంపాదించుకుని బుల్లితెరపై కనిపించి రచ్చ చేసిన ఈమె ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎంత హోరాహోరీగా నడుస్తున్నాయో తెలియనిదేమీ కాదు.. అలాంటిది ఆ ఎన్నికల్లో కుమారి ఆంటీ వేలు పెట్టారు. దీంతో నెట్టింట్లో బర్నింగ్ టాపిక్ అయ్యారు. అదేంటి ఎన్నికలకు కుమారికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. ఈమెది ఏపీనే కదా. అందుకే హైదరబాద్ నుంచి తన స్వగ్రామానికి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొని హడావుడి చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో హాట్ సీటు అయిన గుడివాడలో ప్రచారం అంటే మామూలు విషయమా..? అస్సలు కానే కాదు కదా..! సరిగ్గా ఇక్కడే ప్రచారం చేసి రచ్చ చేస్తోంది కుమారు ఆంటీ..!

కొడాలిని ఎదిరించడమా..?

గుడివాడలో వైసీపీ తరఫున కొడాలి నాని.. టీడీపీ నుంచి వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నానిని ఐదోసారి గెలవనివ్వమని ఓడించి తీరుతామని టీడీపీ పక్కా వ్యూహంతో ఉంది. ఇక నాని అయితే నా గెలుపు ఆపేదెవడ్రా చూసుకుందాం అంటూ ముందుకెళ్తున్నారు. పైగా ఇవే చివరి ఎన్నికలు అని కూడా చెప్పి ప్రచారం చేశారు. ఇప్పటి వరకూ సవాళ్లు, ప్రతి సవాళ్లు.. కౌంటర్లు పేల్చుకున్న అభ్యర్థులు.. ఇప్పుడిక చివరి అస్త్రాలు ఏమైనా ఉన్నాయా అని వెతికి మరీ బయటికి తీస్తున్నారు. నాని సంగతి అటుంచితే రాముకు మాత్రం కుమారి ఆంటీ కనిపించారు.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆమెను రంగంలోకి దింపేసి.. ప్రచారం చేయించి, మీడియాతో కూడా మాట్లాడించారు. దీంతో ఆంటీపై ఓ రేంజిలో వైసీపీ విషం కక్కుతోంది. ఎందుకంటే.. తనకు ఏమీ లేనప్పుడు వైఎస్ జగన్ ఇల్లు ఇచ్చారని.. ఇప్పటి వరకూ టీడీపీకే ఓటేశానని కూడా చెప్పడమే ఇందుకు కారణం. అప్పట్లో ఈమెను వైసీపీ ఆకాశానికెత్తేసి.. ఇప్పుడు టపీమని కిందపడేసి.. తిట్టిపోస్తున్నారు కార్యకర్తలు. ఇక కొడాలి నానినే ఎదురిస్తావా.. ఆయన్ను కాదని ప్రచారం చేస్తావా అని ప్రత్యర్థుల నుంచి కుమారికి బెదిరింపులు రాకుండా ఉంటాయా.. అవన్నీ సర్వసాధారణమే కదా..!. ఎవరి అభిమానం వాళ్లకు ఉంటుంది.. వాళ్లు మనుషులే కదా.. ఇంత మాత్రానికే విమర్శలు, బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసమో వైసీపీకే తెలియాలి. అంతెందుకు మీ నాయకుడే చెప్పారు కదా కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం అని అలాగే ఈమెకు కూడా ఇల్లు వచ్చిందనుకోండి.. అలాగనీ వైసీపీకి ఓటేయాల్సిన.. ఓటేయమని పదిమందికి చెప్పాల్సిన అక్కర్లేదేమో కదా.!

ఆంటీ ఏమంటోంది..?

వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడ పట్టణంలోని 32,31,25,21,24 వార్డుల్లో కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం చేసింది. ఈ సందర్భంగా ఆంటీకి ఏం చెప్పారో ఏమో గానీ వైసీపీని పరోక్షంగా విమర్శిస్తూ.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే కలిగే అనర్ధాలను ప్రజలకు నిశితంగా వివరించిందామె. మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము. సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో రాము గారు సేవ చేస్తున్నారు. నా స్వస్థలమైన పేద ఎరుకపాడులో ప్రజలందరి మంచి కోసం ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉంది. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది. వెనిగండ్ల రాము గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను. నా స్వస్థలమైన గుడివాడ మీద మమకారంతో, గుడివాడలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో, రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాను. గుడివాడలో ఉపాధి అవకాశాలు, లేకపోవడంతో నాలాంటి వారు ఎందరో పక్క రాష్ట్రాలు వెళ్లి కష్టపడాల్సి వస్తోంది. మకొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదు. చక్కటి విజన్ ఉన్న రాము.. కష్టపడే వారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రాము లాంటి నాయకులు అధికారంలో ఉంటేనే, మాలాంటివారికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాము, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వల్లభనేని బాలశౌరిని గెలిపించి, ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని కుమారి ఆంటీ చెప్పుకొచ్చారు. కుమారి ప్రచారం రాముకు ఏ మాత్రం కలిసొస్తుంది.. రేపొద్దున్న కొడాలి నాని గెలిస్తే ఆంటీ పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి మరి.

Kumari Aunty Backs TDP Alliance in Gudivada:

Kumari Aunty Mass Warning To Kodali Nani 

Tags:   KUMARI AUNTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ