నేషనల్ క్రష్ కాస్తా.. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా, లక్కీ గర్ల్ గా మారిపోయిన రష్మిక మందన్న ఇప్పుడు సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు, క్రేజీ ఆఫర్స్ తో మిగతా హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇస్తుంది. సౌత్ లో అల్లు అర్జున్ సరసన పుష్ప ద రూల్ తో పాటుగా క్రేజీ స్టార్ హీరో ధనుష్ తో కుబేర లాంటి మల్టి స్టారర్ లో నటిస్తున్న రశ్మిక మందన్న హిందీలో మాత్రం పాపులర్ హీరోయిన్ గా మారింది.
తెలుగు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీస్ లో ఆఫర్స్ రాకపోయినా హిందీలో మాత్రం పాపకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రష్మిక.. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో సికిందర్ చిత్రంలో ఛాన్స్ పట్టేసి అందరికి షాకిచ్చింది. తమిళ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ చేస్తున్న సికిందర్ మూవీలో రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. సల్మాన్ తో అవకాశం అంటే మాములు విషయం కాదు కదా..
ఆ అనౌన్సమెంట్ వచ్చిన కొద్దిసేపటికే రష్మిక మందన్న కొత్త ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో రష్మిక కొత్తగా, అందంగా, స్వీట్ గా కనిపించింది. వైట్ షర్ట్ లో రష్మిక లుక్ సరికొత్తగా ఉంది. ప్రస్తుతం రష్మిక మందన్న న్యూ ఫోటోషూట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.