పవన్ కళ్యాణ్ కి సినిమా ఇండస్ట్రీ నుంచి పెరుగుతన్న మద్దతు చూసి బ్లూ మీడియా కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అసలు ఊహించని సపోర్ట్ పవన్ కళ్యాణ్ కి సినీ ఇండస్ట్రీ ఇవ్వడంపై ఈకలు పీకుతుంది బ్లూ మీడియా.. మొన్న నాని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి మద్దతునిస్తూ ట్వీట్ చెయ్యడంతో.. నానికి వైసీపీ వాళ్లతో గొడవలున్నాయి, ఆయన సినిమాలప్పుడు వైసీపీ వాళ్ళు నాని ని టార్గెట్ చేస్తున్నారు.. అందుకే నాని పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసాడు అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు కూడా పవన్ కళ్యాణ్ కి ఓటెయ్యమని అడగడంతో బ్లూ మీడియా తట్టుకోలేకపోతుంది. మెగాస్టార్ పై అవాకులు చవాకులు పేలుతుంది. మరోపక్క అల్లు అర్జున్ నుంచి పవన్ కళ్యాణ్ పార్టీకి సపోర్ట్ దక్కదు అనుకుంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా సంపూర్ణంగా పవన్ కి మద్దతు నిచ్చేసాడు. దానితో బ్లూ మీడియా మరింతగా రగిలిపోతుంది.
వైసీపీ ప్రభుత్వానికి, జగన్ కి భయపడి చాలామంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ పై, జనసేనపై నమ్మకం ఉన్నా బహిరంగంగా సపోర్ట్ చేయలేకపోవడం ఒక ఎత్తైతే.. మెగా స్టార్, చిన్న హీరోలంతా పవన్ కళ్యాణ్ వెంట నడవడం మరో ఎత్తు. అదే బ్లూ మీడియాకి మింగుడుపడడం లేదు.
చెప్పను బ్రదర్ అన్న అల్లు అర్జున్ ఇప్పుడు చెప్పండి బ్రదర్ అంటూ జనసేనకు సై అంటున్నాడంటూ వెటకారంగా న్యూస్ లు రాస్తుంది. మరి ఈ కుళ్ళు అంతా పవన్ కళ్యాణ్ కి మద్దతు పెరగడమే కారణమని అర్ధమవుతుంది.