జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కి ఇంకా పది రోజుల టైమ్ ఉంది. మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే. కానీ ఎప్పటి నుంచో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ మొదలు పెట్టేసారు. ఎన్టీఆర్ కటౌట్స్ కట్టడం, బ్యానర్ లు పెట్టడం, పాలాభిషేకాలంటూ హంగామా చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ నటించే సినిమాల నుంచి కూడా కొత్త అప్ డేట్స్ ని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.
కొరటాల దర్శకత్వం లో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం దేవర నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టుగా ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పటి నుంచో ట్రెండ్ చేస్తున్నారు. ఆ విషయమై దేవర టీం కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అఫీషియల్ గా దేవర అప్ డేట్ పై సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు మేకర్స్. On the way!! On the way!! 🎂🎶🎵🥁#DevaraFirstSingle #Devara అంటూ వచ్చిన ట్వీట్ తో ఎన్టీఆర్ ఫాన్స్ లో ఉత్సాహం మొదలైంది.
అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ నుంచి రాబోతున్న దేవర ఫస్ట్ సింగిల్ పై అప్పుడే బోలెడన్ని అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ తో కలిసి ఉన్న డ్యూయెట్ ని ఫస్ట్ సింగిల్ గా వదలబోతున్నట్టుగా టాక్ ఉంది. మరి అది తెలియాలంటే మరో పది రోజులు అంటే ఎన్టీఆర్ బర్త్ డే వరకు ఓపిక పట్టాల్సిందే.