ఇప్పటివరకు మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ జనసేనకు మద్దతు ప్రకటించగా.. వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు పిఠాపురం వెళ్లి జనసేన తరపున పవన్ కళ్యాణ్ గెలుపుకు ప్రచారం చేసారు. చిరు వీడియోతో సరిపెట్టగా.. రామ్ చరణ్ బాబాయ్ ని గెలిపించమంటూ ట్వీటేసాడు..
అయితే ఇక్కడ మెగా హీరోల సపోర్ట్ తో పాటుగా అందరూ అల్లు హీరోల సపోర్ట్ కూడా ఉంటే బావుంటుంది.. అల్లు అరవింద్ కానీ, అల్లు అర్జున్ కానీ జనసేనకు సపోర్ట్ గా ఓ ట్వీట్ అయినా వేయొచ్చుగా.. ఎందుకింతగా సైలెంట్ అయ్యారు అంటూ మాట్లాడుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్ రావడం చూసి జనసైనికులు ఉత్సాహపడుతున్నారు.
గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్ కి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఫైరయ్యారు. మధ్యలో అల్లు ఫాన్స్ vs పవన్ ఫాన్స్ అన్న రేంజ్ లో గొడవలు జరిగాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డైరెక్ట్ గానే పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తూ.. నా హృదయపూర్వక శుభాకాంక్షలు @పవన్ కళ్యాణ్ గారూ మీ ఎన్నికల ప్రయాణంలో.. మీ జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను. కుటుంబ సభ్యునిగా, నా ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఆశించినదంతా సాధించినందుకు నా శుభాకాంక్షలు.. అంటూ ట్వీట్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.