రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంత వేగంగా స్టార్ డమ్ ని చూసాడో.. అంతే వేగంగా డౌన్ ఫాల్ ని చూసాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ రూపంలో ఆ సినిమాలు విజయ్ ని బాగా డిస్పాయింట్ చేసాయి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ అంటూ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడదామనుకున్న విజయ్ దేవరకొండ కి ఆ చిత్రం కెరీర్ లో మాయని మచ్చగా మిగిలింది.
ఆతర్వాత విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో ఎందుకో ఏమిటో నెగిటివిటి స్టార్ట్ అయ్యింది. లైగర్ తర్వాత ఖుషి చిత్రం, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ కానీ, అతని శ్రమ కానీ తగ్గలేదు. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని అనౌన్స్ చేసి రౌడీ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసాడు.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి చిత్రం VD చిత్రం తో పాటుగా.. దిల్ రాజు బ్యానర్ లో రాజా వారు రాణి గారు సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా కాంబోలో సినిమా అనౌన్స్ చేసాడు విజయ్ దేవరకొండ. అంతేకాకుండా టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్ లో పాన్ ఇండియా ఫిలిం ని అనౌన్స్ చెయ్యడం రౌడీ అభిమానులని మరింత ఎగ్జైట్ చేసింది.
ఈ మూడు చిత్రాల అప్ డేట్స్ చూసాక విజయ్ దేవరకొండ రైట్ ట్రాక్ లోకి వచ్చాడంటూ ఆయన అభిమానులే కామెంట్ చేస్తున్నారు. స్టార్ దర్శకులు వెంటపడకుండా టాలెంటెడ్ దర్శకులకి విజయ్ అవకాశమివ్వడం కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ అంశమే.