యాంకర్ శ్రీముఖి కెరీర్ ఆరంభంలో బబ్లీ గా కనిపించినా ఆ తరవాత నాజూగ్గా గ్లామర్ డాల్ లా తయారైంది. వెండితెర మీదకన్నా బుల్లితెర మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టే శ్రీముఖి గ్లామర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపిస్తుంది. ఎలాంటి అవుట్ ఫిట్ అయినా సరే తన కోసమే డిజైన్ చేసారా అనేలా ఆమె డ్రెస్ సెన్స్ ఉంటుంది.
మినీ డ్రెస్, ఫుల్ ఫ్రాక్స్, హాఫ్ సారీ, శారీ ఇలా ఏ అవుట్ ఫిట్ లో అయినా శ్రీముఖి అందంగా ఆకర్షణగానే కాదు గ్లామర్ గాను కనిపిస్తుంది. తాజాగా ఆమె సిల్క్ శారీ లో ఇచ్చిన ఫోజులకి యూత్ మొత్తం ఆమె భజన చెయ్యాల్సిందే. అంత చక్కగా హోమ్లీగా కనిపించింది.
ప్రస్తుతం పలు ఛానల్స్ లో యాంకర్ గా కనబడుతున్న శ్రీముఖి నీతోనే డాన్స్ సీజన్ 2 లో మాత్రం గ్లామర్ గాను, అద్భుతమైన వ్యాఖ్యాతగాను అదరగొడుతుంది. ఆమె ఎక్కువగా స్టార్ మా ఛానల్ లోనే కనిపిస్తుంది. మిగతా ఛానల్స్ లో అప్పుడప్పుడు కనబడుతుంది.