మలయాళంలో పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆవేశం చిత్రం అక్కడి మళయాళీలని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలైన మూడు వారాల్లోనే 150 కోట్ల మార్క్ ని టచ్ చేసి అందరికి షాకిచ్చింది. గ్యాంగ్ స్టార్ రంగ గా ఫహద్ ఫాసిల్ నటనకు అందరూ విజిల్స్ వేస్తున్నారు. అయితే ఈ వారంలో ఆవేశం చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకువస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్సిమెంట్ వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వారు ఆవేశం ఓటీటీ హక్కులని ఫ్యాన్సీ డీల్ కి దక్కించుకున్నారు. అయితే మే 9 నుంచి ఫహద్ ఫాసిల్ ఆవేశం ఓటీటీ స్ట్రీమింగ్ అన్నప్పటికీ.. అమెజాన్ వారు ఎలాంటి హడావిడి చెయ్యలేదు.
కనీసం రేపు స్ట్రీమింగ్ లోకి వస్తుంది అంటూ చిన్నపాటి అనౌన్స్ మెంట్ కూడా చెయ్యకుండా ఈరోజు మే 9 న ఆవేశం చిత్రాన్నిఅమెజాన్ ప్రైమ్ నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చేసారు. అయితే కేవలం మలయాళ వెర్షన్ మాత్రం అమెజాన్ నుంచి అందుబాటులోకి రాగా.. డబ్బింగ్ వెర్షన్ ల గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.