ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ప్రభాస్ వలన బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే NTR 31 పై అప్ డేట్ వస్తుంది అని ఎన్నో అంచనాలు పెట్టుకుని కూర్చున్నారు. కానీ ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ వినడానికి ప్రభాస్ అడ్డం పడుతున్నాడు.
అంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో NTR 31 చిత్రాన్ని ప్రకటిస్తారని అనుకుంటే.. ప్రశాంత్ నీల్ మాత్రం ముందుగా ప్రభాస్ సలార్ 2 చిత్రం షూటింగ్ కంప్లీట్ చెయ్యబోతున్నట్టుగా, త్వరలోనే సలార్ 2 షూటింగ్ మొదలు పెడుతున్నట్టుగా ఆయనొక ఇంటర్వ్యూలో చెప్పడం చూసి ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషిగా అవుతుంటే.. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం బాగా డిస్పాయింట్ అవుతున్నారు.
ప్రభాస్ సలార్ 2 షూటింగ్ అతి త్వరలోనే మొదలు పెడతానని చెప్పిన ప్రశాంత్ నీల్.. 2026లో రాఖీ భాయ్ తో KGF3 ఉంటుంది అంటూ ఆయన ఆ ఇంటర్వ్యూలో ఇచ్చిన క్రేజీ అప్ డేట్ హైలెట్ అయ్యింది.