ఈఎన్నికల్లో బాగా యాక్టీవ్ గా కనిపిస్తాడు అనుకున్న కమెడియన్ ఆలీ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యాడు. గత నాలుగేళ్లలో వైసీపీ పార్టీలో యాక్టీవ్ గా కనిపిస్తున్న సినిమా వాళ్లలో పోసానితో పాటుగా కమెడియన్ ఆలీ ఒకరు. ఆలీ కూడా జగన్ కి నమ్మకంగానే ఉన్నాడు. జగన్ కూడా ఆలీని నిరాశపరచకుండా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని ఇచ్చి సత్కరించారు.
అయితే ఆ పదవి ఇవ్వడంతో ఆలీ చాలా సంతోషపడిపోయాడు. ఆ ఊపులోనే తనకి ఎమ్యెల్యే పదవిపై ఉన్న మోజుని కూడా స్పష్టం చేసాడు. తనని జగన్ ఎమ్యెల్యేగా పోటీ చెయ్యమంటే తాను సిద్ధమని ప్రకటించేశాడు. కానీ జగన్ ఆలీని పక్కనబెట్టేశాడు. దానితో ఆలీ చాలా అంటే చాలా డిస్పాయింట్ అయ్యాడు. దాని వలనే ఆలీ ఈ 2024 ఎన్నికల్లో ఎలాంటి హడావిడి చెయ్యకుండా కామ్ గా ఉండిపోయాడు.
వైసీపీ పార్టీ తనకి ఉన్నత పదవిని ఇస్తుంది.. ఎలాగైనా ఎమ్యెల్యే లేదు అంటే ఎంపీ పదవి వస్తుంది అని ఆశించిన అలీని జగన్ తీవ్రంగా నిరాశపరిచాడు. దానితో ఆలీ కూడా ఈ ఎన్నికలకి మనకు సంబంధమే లేదు అన్నట్టుగా తన పని తాను చూసుకున్నాడు. లేదంటే ఎన్నికల ప్రచారం లో కమెడియన్ ఆలీ కనిపించేవాడు. జగన్ తనని పక్కనబెట్టిన విషయంలో ఆలీ తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.