Advertisementt

పవన్ విషయంలో ఊగిసలాడుతున్న నిర్మాతలు

Wed 08th May 2024 06:29 PM
pawan  పవన్ విషయంలో ఊగిసలాడుతున్న నిర్మాతలు
The makers of Pawan Kalyan movie are in Tension పవన్ విషయంలో ఊగిసలాడుతున్న నిర్మాతలు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలకి ఇప్పుడు ఒకటే టెన్షన్ పట్టుకుంది. ఆయన ఎన్నికల్లో గెలిస్తే.. ఆ సెలెబ్రేషన్స్ లో పడి షూటింగ్ కి ఎప్పుడొస్తాడో అని ఓ కంగారు, మరోపక్క పవన్ కళ్యాణ్ తో కలిసి కూటమకూడా ఓడిపోతే అప్పుడు ఆయన సినిమాలపై వైసీపీ ప్రభుత్వ ప్రభావం ఎలా ఉంటుందో అని మరో కంగారులో ఆయన సినిమా నిర్మాతలు కొట్టుమిట్టాడుతున్నారు.

హరి హర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా అన్ని క్రేజీ సినిమాలే. భారీ బడ్జెట్ సినిమాలు కావడంతోనే ఇప్పుడు నిర్మాతలుఆందోళన పడుతున్నారు. రాజకీయంగా వైసీపీ ప్రభుత్వంతో పవన్ శత్రుత్వం పెట్టుకున్నారు. అక్కడ కూటమి అధికారంలోకి వస్తే తప్ప ఇకపై పవన్ సినిమాలు సర్వైవ్ అవ్వవు.

ఇక ఆయన సినిమా షూటింగ్స్ ఆపేసి ఆరు నెలలవుతుంది. నిర్మాతలు డబ్బు వడ్డీలకి తెచ్చి పెట్టుబడి పెట్టి ఉన్నారు, ఎలక్షన్స్ అయ్యాక పవన్ ఎప్పుడు షూటింగ్ కోసం రెడీ అవుతారో వారికీ తెలియడం లేదు. అటు గెలిచినా, ఇటు ఓడినా మొత్తంగా పవన్ కళ్యాణ్ విషయంలో నిర్మాతలు మాత్రం టెన్షన్ పడాల్సిందే. 

The makers of Pawan Kalyan movie are in Tension:

Tension gripped the director-producers making films with Pawan Kalyan

Tags:   PAWAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ