రణవీర్ సింగ్-దీపికా పదుకొనేలు మరి కొద్ధి నెలల్లో తల్లితండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఎప్పుడో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు పేరెంట్స్ గా మారేందుకు సిద్ధమయ్యారు. దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అన్న వార్త అనౌన్స్ చేసినప్పటి నుంచి రణవీర్ సింగ్, దీపికా అభిమానులు చాలా సంతోషంగా వారికి పుట్టబోయే బిడ్డ కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే దీపికా ప్రెగ్నెంట్ అని ప్రకటించక ముందు ఈ క్యూట్ అండ్ లవ్లీ కపుల్ విడిపోతుంది అనే ప్రచారం జరిగింది. రణవీర్ సింగ్ పై దీపికా పడుకొనే చాలా కోపంగా ఉంది అందుకే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఏవేవో కథనాలు ప్రచారంలో ఉన్న సమయంలో దీపికా ప్రెగ్నెంట్ న్యూస్ ని రణవీర్ అభిమానులతో పంచుకుని అందరికి షాకిచ్చాడు. అయితే ఇప్పుడు దీపికా ప్రెగ్నెంట్ అన్న సమయంలో మరోసారి వీరి విడాకుల న్యూస్ హైలెట్ అయ్యింది. కారణం రణవీర్ సింగ్ చేసిన పని.
రణ్‌వీర్ సింగ్ తాజాగా దీపికాతో ఉన్న పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్ చేశాడు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారనే ఊహాగానాలు మరోమారు తెర మీదకు వచ్చాయి. అయితే దీపికతో కలిసి ఉన్న ఫొటోలు ఉన్నప్పటికీ పెళ్లి ఫొటోలు మాత్రమే డిలేట్ చెయ్యడం అభిమానులను అయోమయానికి గురి చేసింది.