పవన్ కళ్యాణ్ చిన్నన్న నాగబాబు సినిమాలని పక్కనపెట్టి ఎప్పటి నుంచో జనసేన పార్టీ లో తమ్ముడు అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆయన కొడుకు వరుణ్ తేజ్, నాగబాబు భార్య పద్మజ కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసారు. ఇక పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి తన తమ్మడు పవన్ కళ్యాణ్ ని గెలిపించమని, ఆయన్ని చట్ట సభలకి పంపమంటూ ఓ వీడియో వదిలారు.
ఏపీ ప్రజలని ఉద్దేశించి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవగా.. కొంతమంది (పవన్ అభిమానులు, జనసైనికులు) మాత్రం అన్నయ్యా ..మెసేజెనా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చెయ్యరా అంటూ అడుగుతున్నారు. చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే పవన్ కళ్యాణ్ కి మరింత మైలేజ్ వస్తుంది అని వారి ఆశ.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ నెల పది న అంటే శుక్రవారం పిఠాపురం వెళ్లి జనసేన తరపున పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయబోతున్నారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి అదేదో పబ్లిక్ గా అనౌన్స్ చేస్తే కాస్త ఏపీ ప్రజల్లో ముఖ్యంగా పవన్ అభిమానుల్లో ఊపొస్తుంది.