బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ క్రేజీగా కనిపిస్తుంది. బాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేని జాన్వీ కపూర్ ని గ్లోబల్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు బ్యాక్ టు బ్యాక్ తమ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేసరికి.. సౌత్ లో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.
అయితే జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. జాన్వీ కపూర్-శిఖర్ పహారియా లు వీలు చిక్కినప్పుడల్లా తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకొని.. శ్రీవారి ఆశీర్వాదం తీసుకొంటారు. జాన్వీ కపూర్-శిఖర్ పహారియాలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు, అది కూడా తమకి ఎంతో ఇష్టమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో శ్రీవారి సన్నిధి లోనే జాన్వీ కపూర్-శిఖర్ పహారియా లు వివాహం చేసుకుంటారంటూ ప్రచారం జరుగుతుంది.
అంతేకాదు.. జాన్వీ కపూర్ తన పెళ్ళికి తల్లి శ్రీదేవి చీర కట్టుకుని పెళ్లి పీటలపై కూర్చుంటుంది అంటూ ఓ కథనం మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన జాన్వీ కపూర్ ఒకింత సీరియస్ అవడమే కాదు.. పెళ్లి గురించి నాకే తొందర లేదు. వీళ్లు తమకు తోచినట్టు ఏదేదో రాస్తారు. మీడియా వాళ్ళకి వార్తలు ఏ రాయాలో తెలియదు, అసలు వారికి ఎక్కడి నుంచి ఇలాంటి సమాచారం లభిస్తుందో తెలియదు అంటూ జాన్వీ కపూర్ పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.