సీనియర్ హీరో అర్జున్ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ ని హీరోయిన్ గా చేద్దామని ఆశపడిన అర్జున్ కి భంగపాటు ఎదురైంది. ఐశ్వర్య అర్జున్ కెరీర్ ఎలా ఉన్నా ఆమె మాత్రం ప్రేమించినవాడితో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య ని ఐశ్వర్య ప్రేమించింది.
అర్జున్ సర్జా, తంబి రామయ్య లు తమ పిల్లల ప్రేమని అంగీకరించి పెళ్లి చెయ్యడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఉమాపతి కి ఐశ్వర్యకి ఇరు కుటుంబాల నడుమ ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. అక్టోబర్ 27వ తేదీన చెన్నై వేదికగా ఈ నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఐశ్వర్య-ఉమాపతి పెళ్ళికి ముహుర్తాలు కూడా పెట్టారు.
ఇరు కుటుంబాల వారు పెళ్ళికి తేదీని నిశ్చయించినట్టుగా తెలుస్తోంది. జూన్ 10వ తేదీన అంగరంగ వైభంగా వీరి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై వేదికగానే వీరిద్దరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. అంజనసుత శ్రీ యోగాంజనేయ మందిరం పోరుర్ వేదికగా వీరి అర్జున్ సర్జా వీరి పెళ్లి చేయబోతున్నారు. ఈ పెళ్ళికి ఎవరెవరు ప్రముఖులు హాజరవుతారో అనే విషయం తెలియాల్సి ఉంది.
Aishwarya Arjun And Umapathi Ramaiah Marriage Date Fixed