పుష్ప చిత్రం వలన నాకు ప్రత్యేకంగా వచ్చింది ఏమి లేదు, ఆ చిత్రంలో విలన్ కేరెక్టర్ చెయ్యడానికి ప్రధాన కారణం దర్శకుడు సుకుమార్. ఆయన మీదున్న ప్రేమ, గౌరవంతోనే నేను ఆ చిత్రం చేశాను, పుష్ప చిత్రంతో నాకొచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు ఏమి లేదు అంటూ భన్వర్ సింగ్ షెకావత్ గా నటించిన ఫహద్ ఫాసిల్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
దీనితో పుష్ప ద రూల్ చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ ఫహద్ ఫాసిల్ పాత్ర పై అందరిలో అనుమానాలు మొదలవగా.. ముందుగా ఈ కేరెక్టర్ కి అనుకున్న విజయ్ సేతుపతి.. పుష్ప చిత్రంలో నటించడానికి ఒప్పుకుని.. సినిమా షూటింగ్ మొదలయ్యే కొద్దిరోజుల ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. సుకుమార్ విజయ్ సేతుపతి ని ఫహద్ ఫాసిల్ తో రీప్లేస్ చేసారు.
అయితే ఇప్పుడు ఫహద్ ఫాసిల్ చేసిన కామెంట్స్ చూసాక విజయ్ సేతుపతి కూడా అందుకే ఈ ప్రాజెక్ట్ ఉంచి తప్పుకున్నాడా? తనకి పుష్ప వలన వచ్చే ప్రత్యేకమైన క్రేజ్ ఏమి ఉండదు అనే ఆలోచనతోనే విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా? అనే అనుమానాలు మాత్రం బాగా రేజ్ అయ్యాయి.