ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సినిమా ఇండస్ట్రీ పీపుల్ పరోక్షంగా యుద్ధం మొదలు పెట్టారా.. అంటే అవుననే అనిపిస్తుంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బహిరంగంగానే మద్దతు తెలిపారు. తన తమ్ముడిని అసంబ్లీకి పంపించమంటూ వీడియో వదిలారు. ఆ తర్వాత హీరో నాని కూడా పవన్ కళ్యాణ్ కోసం ట్వీట్ వేసాడు.
ఇక చిరు చేసిన వీడియో షేర్ చేస్తూ రామ్ చరణ్ కూడా బాబాయ్ ని గెలిపించమంటూ జనసేనకు మద్దతు తెలిపారు. వీరంతా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తున్నా ఇండైరెక్ట్ గా టీడీపీ కి సపోర్ట్ చేసినట్టే. కారణం జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అయితే ఇదంతా చూస్తుంటే జగన్ పై సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు ఇండైరెక్ట్ గా యుద్దానికి దిగినట్టే అనిపిస్తుంది.
ఈరోజు రేపు మరికొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు (హీరోలు) పవన్ కళ్యాన్ కి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. మరి ఇది జగన్ ని వ్యతిరేఖించినట్టేగా..!