పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాదు, పుష్ప చిత్రంలో పుష్ప రాజ్ కేరెక్టర్ కి గాను ఆయన నేషనల్ అవార్డు అందుకున్నాడు. అటు సుకుమార్, ఇటు హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ అందరూ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో ట్రెండ్ అయ్యారు. పుష్ప చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించిన ఫహద్ ఫాసిల్ కి కూడా పుష్ప చిత్రం చాలా హెల్ప్ అవడం కాదు.. తెలుగులో ఆయన పేరు ఆ తర్వాత ఎక్కువగా వినిపించింది.
అయితే తాజాగా ఫహద్ ఫాసిల్ మాత్రం తనకి పుష్ప చిత్రం వల్ల ఏం ఒరగలేదు అని, ఆ విషయం సుకుమార్ కి కూడా చెప్పాను, పుష్ప లో నేను విలన్ గా కేవలం సుకుమార్ గారి మీద ఉన్న ప్రేమ, గౌరవం తోనే చేశాను, అసలు తన మొదటి ప్రయారిటీ ఎప్పటికీ మళయాళ సినిమానే ఉంటుంది అని తెలిపాడు.
తనకి కేరళ దాటి పుష్ప చిత్రం వలన ఎక్కువ క్రేజ్ వచ్చిందా అంటే లేదు అనే చెప్తాను, అలా అని నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉండవచ్చు కానీ తనకి అనిపించింది చెప్పాను అంటూ ఫహద్ ఫాసిల్ అందరికి పెద్ద షాకే ఇచ్చాడు. అందుకే పుష్ప ప్రమోషన్స్ లో కానీ, పుష్ప సక్సెస్ లో కానీ భాగమవ్వలేదేమో ఫహద్ ఫాసిల్.