కొరటాల శివ దేవర చిత్ర షూటింగ్ కి అస్సలు బ్రేకివ్వడంలేదు. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం సమయాన్ని వెచ్చిస్తూ అందుబాటులో లేకపోయినా, కృష్ణమ్మ ప్రమోషన్స్ కోసం కొరటాల శివ పాల్గొంటున్నా దేవర షూటింగ్ మాత్రం అల్లూరి జిల్లాలోజరుగుతూనే ఉంది. అయితే ఎన్టీఆర్ లేకపోయినా ఈ చిత్రంలో విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ కి సంబందించిన సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
గత రెండు నెలలుగా సైఫ్ అలీ ఖాన్ దేవర టీమ్ కి అందుబాటులో లేరు. సైఫ్ అలీ ఖాన్ కే దేవర షూటింగ్ లో చేతికి గాయమవడంతో ఆయన నిన్నమొన్నటివరకు విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు దేవర టీమ్ కి అందుబాటులోకి రావడంతో కొరటాల సైఫ్ కి సంబందించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈలోపులో టీమ్ ని తేనేటీగలు డిస్టర్బ్ చేసాయి.
ఇక త్వరలో ఎన్టీఆర్ కూడా ముంబై నుంచి వచ్చి దేవర టీమ్‌తో చేరతారని తెలుస్తోంది. ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో ప్రధాన విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కి సంబందించిన షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ అలాగే అల్లూరి జిల్లాలోనే జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో సైఫ్ అలీఖాన్ ఎపిసోడ్ షూట్ పూర్తవుతుంది అని సమాచారం.