అప్పుడప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ కి జనసేనకు మద్దతుగా మాట్లాడే రామ్ చరణ్ ఇప్పుడు రాబోయే ఎన్నికల సందర్భంగా బాబాయ్ కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నాడు, అసలు జనసేనానికి సపోర్ట్ గా చరణ్ ట్వీట్ వేస్తాడా, లేదంటే డైరెక్ట్ గా రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ తరపున జనసేన కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తాడా.. ఇలా మెగా అభిమానులతో పాటుగా, జనసైనికులే కాదు ఏపీ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు.
కానీ ఇప్పటివరకు మెగా హీరోలైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ లు జనసేన కి సపోర్ట్ గా ప్రచారం చేస్తున్నా రామ్ చరణ్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఈరోజు సోమవారం మెగాస్టార్ చిరు.. తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించమంటూ ఓ వీడియో చేసారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా రంగం లోకి దిగిపోయాడు.
అంటే రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రి మాట్లాడిన వీడియో ని షేర్ చేస్తూ.. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి.. అంటూ ట్వీట్ వెయ్యడంతో రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగిపోయాడంటూ మెగా ఫాన్స్, జనసైనికులు ఉత్సాహపడుతున్నారు. మరి చరణ్ ట్వీట్ తోనే సరిపెడతాడా.. లేదంటే ప్రచారానికి వచ్చి పిఠాపురం ప్రజలని సర్ ప్రైజ్ చేస్తూ బాబాయ్ కి తోడుంటాడో చూద్దాం.