నారా రోహిత్ హీరోగా జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కించిన ప్రతినిధి చిత్రం ఖచ్చితంగా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందే అని ఆ చిత్ర పోస్టర్స్, టీజర్ చూస్తే అర్ధమవుతుంది. నారా రోహిత్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు. ప్రస్తుతం నారా రోహిత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. అటు మూర్తి కూడా టీడీపీ కి అభిమాని.
అందుకే వీరి కలయికలో వస్తున్న ప్రతినిధి చిత్రంపైన అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ముందుగా ప్రతినిధి 2 ని ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అది ఇప్పుడు మే 10 కి పోస్ట్ పోన్ అయ్యింది. మే 13 న ఏపీ ఎలక్షన్స్ జరుగుతాయి. సో అలా టీడీపీ కి ప్రతినిధి 2 చిత్రం ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ అసలు ఈ చిత్రం మే 10 న విడుదలవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
కారణం ప్రతినిధి 2 కి సంబందించిన ప్రమోషన్స్ లేవు. మూర్తి ఛానల్స్ ఇంటర్వ్యూల్లో కనబడుతున్నారు. నారా రోహిత్ మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్నాడు. మే 10 న విడుదల కాబోతున్న కృష్ణమ్మ, డబ్బింగ్ మూవీ సత్య చిత్ర ప్రమోషన్స్ బాగా ఉన్నప్పటికీ.. ప్రతినిధి ప్రమోషన్స్ కనిపించకపోయేసరికి ఇలా అందరిలో అనుమానం మొదలైంది. ఇంతకీ ప్రతినిధి2 ఉన్నట్టా? లేనట్టా? అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సినీ జనాలు.