గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ ప్రస్తుతం అల్లూరి జిల్లాలో జరుగుతోంది. సైఫ్ అలీఖాన్ పై కొరటాల శివ కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు. దేవర యూనిట్ మొత్తం షూటింగ్ చిత్రీకరణలో బిజీగా ఉండగా.. చిత్ర యూనిట్ పై తేనెటీగల దాడి జరిగిందని తెలుస్తోంది. మోద కొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.
ఒక ఫైట్ సీన్ చిత్రీకరణలో భాగంగా చిత్ర యూనిట్ డ్రోన్ ఎగురవేయగా ఆ శబ్ధానికి తేనెటీగలు ఎగిరి అక్కడే ఉన్న చిత్రయూనిట్ పై దాడి చేసాయని తెలుస్తోంది. తేనెటీగల గుంపు దాడిచేయడంతో ఆసుపత్రిలో 20 మంది చేరినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎన్టీఆర్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది.
అక్టోబర్ 10 న థియేటర్లలో దేవర పార్ట్ వన్ సందడి చేయబోతోంది. ఈ మూవీని రెండు పార్టులుగా తీస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించుకోతున్నారు.