పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ఆయనకి మద్దతునిస్తారనే అనుకున్నారు. కానీ గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ వెంట నడిచిన సినిమా ఇండస్ట్రీ పీపుల్ చాలా తక్కువ. ఈ ఎన్నికల్లో కూడా 30 ఇయర్స్ పృథ్వీ, జబర్దస్త్ బ్యాచ్ తో పాటుగా మెగా హీరోలు మాత్రమే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారంలోకి దిగారు.
మిగతా సినిమా ఇండస్ట్రీ ప్రముఖులెవరూ పవన్ కళ్యాణ్ కి మద్దుతు ప్రకటించకుండా సైలెంట్ గా ఉన్నారు. మెగాస్టార్ చిరు జనసేనకు 5 కోట్ల భారీ విరాళం ఇవ్వడమే కాకుండా.. పవన్ కళ్యాణ్ ని అసంబ్లీకి పంపించమని, తమ్ముడికి మద్దతుగా వీడియో వదిలారు. చిరు వీడియో వచ్చిన సెకన్స్ లోనే హీరో నాని పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ ట్వీట్ వెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కొనబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని మరియు మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను.. ఆల్ ది వెరీ బెస్ట్ సర్ అంటూ నాని వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
నాని మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా భావించే నితిన్, నిఖిల్, ఆయన్ని అభిమానించే రవితేజ లాంటి హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తారని జనసైనికులు భావిస్తున్నారు. మరి ఇది జనసేనకు శుభ పరిణామమే అని చెప్పాలి.