మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ జనసేన కోసం పిఠాపురంలో రోడ్ షో లు చేస్తూ జనసేనానిని గెలిపించమని ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ ఇలా అందరూ ఎండలో పడి పవన్ కళ్యాణ్ కోసం కష్టపడుతున్నారు. మెగా హీరోలంతా అలా ఉంటే.. మెగా డాటర్ నిహారిక మాత్రం ముంబైలో తేలింది.
నిహారిక ఆమె ఫ్రెండ్స్ వితిక షేరు, మహాతల్లి జాన్వీ ముగ్గురు కలిసి ముంబైలో కనిపించడమే కాదు.. ముంబైలో హంగామా చేస్తూ ఓ షో కోసం రెడీ అయ్యి ఫొటోలకి ఫోజులిచ్చారు. టూ మోడ్రెన్ డ్రెస్సులతో నిహారిక ఆమె ఫ్రెండ్స్ ఫోటో షూట్ చేయించుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నిహారిక ఈమధ్యన ఫుల్ ట్రెండీ లుక్ లో కనబడుతుంది. ఇక వితిక ఎప్పుడు ఫ్యాషన్ గర్ల్. మహాతల్లి జాన్వీ కూడా మోడ్రెన్ గర్ల్. ఈ ముగ్గురు కలిసి ఆ షో కోసం మెస్మరైజ్ చేసే లుక్స్ తో అదరగొట్టేసారు.