Advertisementt

ట్రాన్స్పరెంట్ శారీ లో అలియా భట్

Tue 07th May 2024 11:03 AM
alia bhatt  ట్రాన్స్పరెంట్ శారీ లో అలియా భట్
Alia Bhatt Stuns in Sabyasachi Saree ట్రాన్స్పరెంట్ శారీ లో అలియా భట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో సౌత్ ఆడియన్స్ మనసులని దోచేసింది. అంతేకాకుండా గంగూభాయ్ కతీయవాడి చిత్రంలో అలియా భట్ నటనకు విమర్శకుల ప్రశంశలతో పాటుగా బోలెడన్ని అవార్డులని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న అలియా భట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దేవరలో నటించాల్సి ఉన్నప్పటికీ.. పాప పుట్టడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది. 

ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడం మాత్రమే కాకుండా భర్త రణబీర్ కపూర్, కూతురు రహా తో టైమ్ స్పెండ్ చేస్తున్న అలియా భట్ ఫ్యాషన్ గర్ల్ అనే విషయం తెలిసిందే. ఆమె బాలీవుడ్ ఈవెంట్స్ కి చాలా ఫ్యాషన్ గా రెడీ అయ్యి వెళుతుంది. తాజాగా అలియా భట్ ట్రాన్స్పరెంట్ శారీ లో కనిపించి మతులు పోగొట్టింది. 

మెట్ గాలా 2024 ఈవెంట్ కోసం కస్టమ్ సబ్యసాచి చీరను ధరించిన అలియా భట్.. ఆ చీరలో అందంగానూ, అద్భుతంగాను కనిపించింది. సబ్యసాచి డిజైనర్లు ఈ చీరని సున్నితంగా చేతితో ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన పూలతో డిజైన్ చేసారు. ప్రస్తుతం అలియా భట్ చీరని సబ్యసాచి వారు చేతులతో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. 

Alia Bhatt Stuns in Sabyasachi Saree :

Alia Bhatt Stuns in Sabyasachi Saree at Met Gala 2024

Tags:   ALIA BHATT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ