నిన్నమొన్నటివరకు సలార్ పార్ట్ 2 షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుంది అన్నప్పటికీ.. ప్రభాస్ డేట్స్ కారణంగా అది మే చివరి వారానికి వాయిదా పడింది. మధ్యలో సలార్ 2 షూటింగ్ ఇప్పుడు కాదు.. ముందు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ ని మొదలు పెడుతున్నారనే ప్రచారం షురూ అయినా.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2కి సంబందించిన మిగతా షూటింగ్ పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు.
అందుకే ప్రభాస్ కూడా కల్కి షూటింగ్ పూర్తవడంతో అటు రాజా సాబ్ ఇటు సలార్ షూటింగ్స్ ని ఏకకాలంలో చెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నాడు. మే చివరి వారం నుంచి ప్రభాస్ సలార్ 2 షూటింగ్ సెట్స్ లో కాలు పెడతారాదని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల పాటు సుదీర్ఘంగా సాగే షెడ్యూల్ లో ప్రభాస్-పృథ్వీ రాజ్ సుకుమారన్ లపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటనీ తెరకెక్కిస్తారని సమాచారం.
సలార్ పార్ట్ 1 తో పాటుగా సలార్ 2 షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయ్యింది. ఇప్పుడు మొదలు పెట్టబోయే ఈ షెడ్యూల్ తో టాకీ మొత్తం ఓ కొలిక్కి వస్తుంది అని తెలుస్తోంది. ప్రభాస్ కూడా పూర్తిగా సలార్ 2 మీద దృష్టి పెట్టాడు. సలార్ 2 షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేవరకు ప్రభాస్ డే అండ్ నైట్ వర్క్ చెయ్యబోతున్నట్లుగా టాక్.