గత మూడు నెలలుగా వారం వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు మాత్రం చాలా నిరాశక్తిగా కనిపిస్తున్నారు. మూడు నెలలుగా చిన్న సినిమాలు మాత్రమే థియేటర్స్ లో విడుదలవుతున్నాయి తప్ప పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు. గత వారం పొలోమంటూ చిన్న చిత్రాల జాతర చూసాం.. ఈ వారం ఎన్నికల వేడిని తట్టుకుంటూ మరికొన్ని చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం సత్యదేవ్ కృష్ణమ్మ, నారా రోహిత్ ల ప్రతినిధి 2 చిత్రాలతో పాటుగా సత్య అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కాబోతుంది.
వాటితో పాటుగా ఈ వారం అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యాయి.
నెట్ ఫ్లిక్స్ : ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (హాలీవుడ్) -మే 6
బోడ్కిన్ (వెబ్ సిరీస్) - మే 9
మదర్ ఆఫ్ ది బ్రైడ్ (హాలీవుడ్) - మే 9
థాంక్యూ నెక్స్ట్ (వెబ్ సిరీస్) - మే 9
లివింగ్ విత్ లిపార్ట్స్ (హాలీవుడ్) - మే 10
అమెజాన్ ప్రైమ్ వీడియో: ఆవేశం (తెలుగు) - మే 9
మ్యాక్స్ టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 9
ది గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 9
యోధ - మే 10
ఆహా: ఆవేశం (తమిళ్) - మే 9
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (హాలీవుడ్) - మే 10
జీ5: 8AM మెట్రో - మే 10
పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10