కొరటాల శివ ప్రస్తుతం దేవర షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. అటు ఎన్టీఆర్ కూడా వార్ 2 షూటింగ్ కోసం ముంబై వెళ్ళాడు. అక్కడొక లాంగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసి ఆయన తిరిగి హైదరాబాద్ కి వస్తారు. ఇక కొరటాల కూడా సత్యదేవ్ తో చేసిన కృష్ణమ్మ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా కనబడుతున్నారు. కృష్ణమ్మ చిత్రం మే 10 న విడుదల కాబోతుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో కొరటాలకి తరచూ దేవర అప్ డేట్స్ పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కొరటాల దేవర విషయంలో మౌనం వహించారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా దేవర విడుదలకు చాలా సమయం ఉంది. అందుకే అప్పుడే దాని గురించి ఏమి మాట్లాడలేను.
కానీ దేవర చిత్రం డెఫనెట్ గా నాకు, ఎన్టీఆర్ ఫాన్స్ కి స్పెషల్ ఫిలిం అవుతుంది అని మాత్రం చెప్పగలను అంటూ కొరటాల దేవర అప్ డేట్ విషయంలో సున్నితంగా సైడ్ అయ్యారు. మరి మే 20 ఎన్టీఆర్ బర్త్ డే రోజున దేవర నుంచి ఓ స్పెషల్ ట్రీట్ పాన్ ఇండియా ఆడియన్స్ కి ఎన్టీఆర్ ఫాన్స్ కి అందబోతున్నట్టుగా తెలుస్తోంది.