గుంటూరు కారం సినిమా చూసాక మీనాక్షి చౌదరి పనైపోయింది అనుకున్న వాళ్ళకి ఆమె చేతిలో ఉన్న అవకాశాలు చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఇప్పటికే మీనాక్షి చౌదరి విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాతో పాటుగా .. టాలీవుడ్ హీరోలతో జత కడుతుంది. ఆమె పుట్టిన రోజునాడు మీనాక్షి చౌదరి నటించే సినిమాల నుంచి బోలెడన్ని సర్ ప్రైజ్ లు అందాయి.
విజయ్-వెంకట్ ప్రభు GOAT చిత్రం, అలాగే దుల్కర్ సల్మాన్-వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, వరుణ్ తేజ్ మట్కాలో ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు.. మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ చిత్రం లోను మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోస్ ని షేర్ చేసే మీనాక్షి ఈసారి ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఆ ఫొటోస్ ని వదిలింది.
అది కూడా బీచ్ ఒడ్డున రెడ్ శారీ లో. సముద్రపు ఒడ్డున మీనాక్షి చౌదరి కొత్త లుక్ చూసిన నెటిజెన్స్ నిజంగా భలే ముద్దుగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె అభిమానులైతే మీనాక్షి సాంప్రదాయమైన దుస్తుల్లో చూసి మైమరిచిపోతున్నారు. మీనాక్షి రెడ్ శారీ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.