Advertisementt

ముద్రగడ.. ఇంత దిగజారుడా..!?

Mon 06th May 2024 03:55 PM
mudragada padmanabham  ముద్రగడ.. ఇంత దిగజారుడా..!?
Mudragada.. is it so bad..!? ముద్రగడ.. ఇంత దిగజారుడా..!?
Advertisement
Ads by CJ

ముద్రగడ పద్మనాభం.. ఒకానొకప్పుడు కాపుల్లో, తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎంత మంచి పేరు, గుర్తింపు ఉన్నదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన సామాజిక వర్గం కోసం ఉద్యమించి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ గళం వినిపించిన ఘనత ఇతనిది. కానీ ఎప్పుడైతే రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చి వైసీపీలో చేరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారో ఇంత వరస్ట్.. డర్టియస్ట్ పొలిటిషియన్‌గా మారిపోయారు. మీడియా ముందుకొచ్చి నోరు తెరిస్తే అన్నీ నీచపు మాటలే. ఒక్క మాటలో చెప్పాలంటే పేరుకే ఈయన పెద్ద మనిషి.. చేసేవన్నీ పైత్యం పనులే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇందులో ఎలాంటి సందేహాలున్నా.. వైసీపీలో చేరినప్పటి నుంచి ముద్రగడ ప్రెస్‌మీట్లు చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

సొంత ఫ్యామిలీ లేదు.. పరాయి ఫ్యామిలీ లేదు మన, తన అని చూడకుండా ఇష్టానుసారం మాట్లాడేస్తూ మీడియాలో ఐటమ్‌గా మారిపోతున్నారు. నిన్న, మొన్నటి వరకూ సొంత కుమార్తె విషయంలో ఎంత రచ్చ  జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కన్న కూతురని చూడకుండా క్రాంతి భారతిని ప్రాపర్టీ అంటూ మాట్లాడటం ముద్రగడకే చెల్లింది. అలాంటిది ఇక పరాయి కుటుంబాల గురించి మాట్లాడటానికి మారు మాటైనా ఆలోచిస్తారా..?. ఏం చేసైనా సరే గెలవాలని వైసీపీ.. ఏం మాట్లాడైనా సరే పవన్‌ను డీగ్రేడ్ చేయాలని ముద్రగడ కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నారు. అందుకే మీడియా ముందుకొచ్చేసి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. విమర్శలు చేయొచ్చు తప్పు లేదు కానీ.. వ్యక్తిగతంగా ఆ ఇంట్లో ఆడపడుచుల ప్రస్తావన కూడా తీసుకురావడం ఎంత దుర్మార్గమో అర్థం చేసుకోవచ్చు.

మరీ టూ మచ్!!

తండ్రిపై తిరుగుబాటు చేస్తున్న క్రాంతికి తాను అండగా ఉంటానని.. రానున్న ఎన్నికల్లో టికెట్ కూడా ఇస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై విమర్శలు చేయొచ్చు కానీ నోరు పారేసుకున్నారు. పవన్.. తన కూతురిని అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. అంతేకాదు పవన్ తన ముగ్గురు భార్యలను పరిచయం చేయగలరా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు గానీ.. తన కుటుంబ సభ్యులకు గానీ ఏం జరిగినా సరే క్రాంతిని పంపకండి.. అమ్మా తమరు కూడా వస్తానని అనకుండి అంటూ కన్నకూతురిపై విషం చిమ్మారు. అంతటితో ఆగని ముద్రగడ.. పవన్‌ సీటుకే దిక్కు లేదు.. మా అమ్మాయికి సీటు ఇస్తారా..? పవన్‌ చెప్పేది సొల్లు అంటూ కామెంట్స్ చేశారు. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి.. కులాలు, కుటుంబాల మధ్య చిచ్చుపెట్టాలని మీ గురువు చెప్పారా? అని.. చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ అభివర్ణించారు. భీమవరం, గాజువాకలో తన్ని తరిమేశారని త్వరలోనే పిఠాపురంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ముద్రగడ జోస్యం చెప్పారు.

ఇంత గలీజు మాటలేంటో..?

పవన్ భార్యల గురించి.. కుమార్తె గురించి.. సీటు గురించి మాట్లాడిన ముద్రగడ ఇంతటితో మీడియా మీట్ ముగించి ఉంటే సరిపోయేదేమో కానీ.. మరింత ఓవరాక్షన్ చేశారు.  ఏకంగా మెగా కుటుంబ సభ్యులపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. మెగా ఫ్యామిలిలో ఎవరు పబ్బుల్లో తిరుగుతున్నారు.. ఎవరు ఎవరితో ఉంటున్నారో బయటకు చెప్పాలని డిమాండ్ చేయడం ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోండి. అదేదో సినిమాలో ఇంతకుమించి దిగజరావు అన్న ప్రతిసారి ప్రూవ్ చేస్తున్నావనే డైలాగ్ ఉంది కదా.. ఇది అక్షరాలా ముద్రగడకు సరిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విమర్శలు చేయొచ్చు.. దానికి హద్దులుండాలి కానీ అతి మాటలు, మితి మీరిన మాటలతో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా.. రానున్న రోజుల్లో ఫలితం ఉంటుందన్నది తెలుసుకుంటే మంచిదేమో అని రాజకీయ విశ్లేషకులు.. ముద్రగడకు సూచిస్తున్న పరిస్థితి. ఫైనల్‌గా పిఠాపురంలో పవన్ పరిస్థితి ఎలా ఉంటుందో.. ఆ తర్వాత ముద్రగడ కథేంటి అన్నది చూడాలి మరి.

Mudragada.. is it so bad..!?:

Mudragada Padmanabham Series Comments On Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ