పవన్ కళ్యాణ్ ని పదే పదే పెళ్లిళ్లు చేసుకుని వదిలేస్తాడు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, భార్యలకు న్యాయం చెయ్యలేనోడు రాష్ట్రానికి, ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు.. పవన్ కళ్యాణ్ అనేటోడు చంద్రబాబుకి దత్తపుత్రుడు.. అంటూ సీఎం స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా వైసీపీ నేతలు, మంత్రులు మాట్లాడొచ్చు, అది వాళ్ళకి న్యాయంగానే ఉండొచ్చు.
అదే వైసీపీ పై, ఆయా మంత్రులపై ఏమైనా మాట్లాడితే అది తప్పు అని గింజుకుంటారు. ముద్రగడ పద్మనాభం, పోతిన మహేష్ లాంటి వాళ్లతో పవన్ కళ్యాణ్ ని ఎన్ని మాటలైనా అనిపించొచ్చు, అదే ముద్రగడ పద్మనాభం కూతురు పవన్ కి సపోర్ట్ గా తండ్రి గురించిన నిజాలు బయటపెడితే తప్పు, ఇక అంబటి రాసలీలలు గత ఐదేళ్ళుగా మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాజీ అల్లుడు అంబటి రాంబాబు గురించి నిజాలు బయటపెడుతూ వీడియో చేస్తే అది తప్పు. అది ఎవరూ బలవంతంగా చేయించింది కాదు.. అయినా అది జనసేన పనే అని వైసీపీ గగ్గోలు.
తాము చేస్తే ఓ న్యాయం.. మీరు చేసేది మాత్రం అన్యాయం అంటూ.. వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు పెడుతుంది. రీసెంట్ గా వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి.. పరాకాష్టకి చేరిన జనసేన నీచ రాజకీయాలు!
మొన్న ముద్రగడ గారి కూతురితో వీడియో.. ఈరోజు అంబటి రాంబాబు గారి అల్లుడు గౌతంతో వీడియో
గౌతం అరాచకాలు భరించలేక పిల్లలతో కలిసి దూరంగా ఉంటున్న అంబటి గారి కూతురు. ఆ వ్యక్తిగత విభేదాన్ని కూడా రాజకీయం చేస్తున్న జనసేన, ఏ స్థాయికి దిగజారిపోయారు అంటూ జనసేనపై ట్వీట్లు వెయ్యడం హాస్యాస్పదం.
అది చూసిన కొంతమంది పవన్ ఫాన్స్..
వ్వ్యక్తిగత విభేదాల గురించి మనమే నీతులు చెప్పాలి @ysjagan,
పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల గురించి జగన్ రెడ్డి పేపెర్ చూసి స్పీచ్ లు ఇచ్చినప్పుడు,
సొంత చెల్లెళ్ళ ను చంద్రబాబు వెనక ఉండి నడిపిస్తున్నాడు అన్నప్పుడు ..
ఇంట్లో సొంత బాబాయి హంతకుడిని పెట్టుకుని నీతులు వల్లిస్తున్నావ్ @ysjagan అంటూ జనసేన నేతలు, పవన్ అభిమానులు జగన్ ని సోషల్ మీడియాలో ఆడుకోవడమే కాదు.. మీకో న్యాయం, పవన్ కళ్యాణ్ కో న్యాయమా.. ఎట్టెట్టా అంటూ వ్యంగంగా మాట్లాడుకుంటున్నారు.