Advertisementt

డబుల్ ఇస్మార్ట్ కి వేళాయరా..

Mon 06th May 2024 11:52 AM
double ismart  డబుల్ ఇస్మార్ట్ కి వేళాయరా..
Double iSmart teaser on this date డబుల్ ఇస్మార్ట్ కి వేళాయరా..
Advertisement
Ads by CJ

ఇస్మార్ట్ శంకర్ ని ఇప్పటికి బుల్లితెర మీద చూడగానే మాస్ ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన ఇస్మార్ట్ శంకర్ లో హీరో రామ్ మాస్ కేరెక్టర్ లో ఇరగ్గొట్టేసాడు. ఆ చిత్రానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ పూరి-రామ్ కాంబోలో మరో మూవీ మొదలైంది. అసలైతే ఈ చిత్రం మార్చ్ లో మహా శివరాత్రికి విడుదల కావాల్సి ఉంది. 

కానీ కొన్ని కారణాల వలన ఈ చిత్రాన్ని జూన్ కి పోస్ట్ పోన్ చేసారు. ప్రస్తుతం ముంబైలో మాసివ్ షెడ్యూల్ చిత్రీకరణలో ఉన్న ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే  మే 15, 2024న డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్-ఛార్మి ఇద్దరూ కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర లో కనిపించనున్నారు. 

Double iSmart teaser on this date:

Double iSmart Teaser Release Date Revealed

Tags:   DOUBLE ISMART
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ