జబర్దస్త్ జెడ్జ్ లుగా నాగబాబు, రోజా అంటే కమెడియన్స్ కి చాలా అభిమానం. వాళ్ళు ఏం చెబితే అదే చేస్తారు. నాగబాబు అంటే మరింతగా గౌరవం. ఆయనతో పాటుగా జబర్దస్త్ కి చాలామంది బై బై చెప్పేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో చాలామంది కమెడియన్స్ రోజాకి, నాగబాబుకు సపోర్ట్ చేస్తారనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా జబర్థస్త్ కమెడియన్స్ అంతా నాగబాబు పార్టీ జనసేనకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చెయ్యడం రోజాకి బిగ్ షాకిచ్చింది.
ఏ ఒక్కరూ రోజాని సపోర్ట్ చేయకపోవడంతో రోజా.. కమెడియన్స్ పై చీప్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ లో మెగా హీరోలకి ఎదురెళ్ళి ఏం చేసినా..అవకాశాలు రావనే భయంతోనే జబర్దస్త్ కమెడియన్స్ అంతా పవన్ కళ్యాణ్ కి భజన చేస్తున్నారు. వారికి జనసేన నుంచి ముడుపులు అందుతున్నాయంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రోజా వ్యాఖ్యలకు కౌంటర్ వేసాడు. తామంతా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే జనసేనకు ప్రచారం చేశామని.. తమను ఎవ్వరూ జనసేన పార్టీ తరఫున ప్రచారానికి పిలవలేదని, తమ మీద ఒత్తిడి తేలేదని స్వచ్ఛందంగా వెళ్లి జనసేన కోసం ప్రచారం చేశామని చెప్పాడు.
అంతేకాదు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల కంటే తాను బయటి హీరోల సినిమాల్లోనే ఎక్కువ పాత్రలు చేశానని, ఎన్టీఆర్, నాని, వెంకటేష్ ఇలా చాలామంది హీరోలతో కలిసి సినిమాలు చేశానని.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి జనాదరణ ఎక్కువ ఉంది, ఆయన అక్కడ లక్ష మెజారిటీతో గెలుస్తారని శ్రీను చెప్పుకొచ్చాడు.