క్రాంతి భారతి.. ఈ పేరు మీడియాలో చూసినా సోషల్ మీడియా ఓపెన్ చేసినా వినిపిస్తోంది.. కనిపిస్తోంది..!! ఎవరబ్బా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఆమె మరెవరో కాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మెచ్చిన వ్యక్తి. సేనాని అంటే విపరీతమైన అభిమానం.. ఎంతలా అంటే తన తండ్రి ముద్రగడ పద్మనాభంను కూడా ఎదురించి పవన్ ను గెలిపించండి అని చెప్పేంత..! ఇప్పుడు అర్థం అయ్యింది కదూ.. పరిస్థితి ఏంటి అనేది..!!
తగ్గేదెలే..!!
కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గురుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఇన్నాళ్లు కాపులు.. కాపులు అన్న ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఎలా మారిపోయారో అందరికీ.. ప్రత్యేకించి కాపులకు చెప్పక్కర్లేదు. పూర్తిగా వైసీపీ అధినేత జగన్ రెడ్డి తొత్తుగా మారి ప్రవర్తిస్తున్నారు అని కన్న కూతురే రివర్స్ అయిన పరిస్థితి. రాజకీయాలను.. రాజకీయాలుగా చూడాలి కానీ వ్యక్తిగతంగా పోవడం ఏంటి అని క్రాంతి కన్నెర్ర చేసి నాన్నను నిలదీశారు. దీంతో ఈమె పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. అలా కూతురి మాటలకు తండ్రి రియాక్ట్.. మళ్ళీ క్రాంతి మరో వీడియో రిలీజ్ చేయడం ఇదంతా పెద్ద కథే రచ్చే అయ్యింది.
సీటు ఇస్తా!!
తప్పు చేస్తున్న తండ్రినే ఎదురించిన క్రాంతిని పవన్ మెచ్చుకున్నారు. ఆమె ధైర్యం, సాహసం.. ప్రశ్నించే తత్వం నచ్చి వెంటనే తన దగ్గరికి పిలిపించుకొని మాట్లాడారు. భారతిని ప్రశంసలతో ముంచెత్తారు. అంతే కాదు రేపొద్దున్న ఏ ఎన్నికలు జరిగినా కచ్చితంగా టికెట్ ఇస్తానని మాటిచ్చారు. దీంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నిజంగా ఇది ఊహించని బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. పవన్ ప్రకటనతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఇదే పవన్ నిజ స్వరూపం అంటే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తారో.. లేకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో చూడాలి మరి.