Advertisementt

ప్రభాస్ వల్లే కమల్ వెనక్కి..

Sun 05th May 2024 10:20 PM
kamal haasan  ప్రభాస్ వల్లే కమల్ వెనక్కి..
Kamal back step because of Prabhas.. ప్రభాస్ వల్లే కమల్ వెనక్కి..
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ - శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ఇండియన్ 2 చిత్రం షూటింగ్ పూర్తవడమే తరువాయి.. జూన్ రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఇండియన్ 2 చిత్రం జూన్ రిలీజ్ అన్నప్పటికీ.. పర్టిక్యులర్ డేట్ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

మే 16 న చెన్నై లో ఇండియన్ 2 ఆడియో లాంచ్ వేడుక కోసం మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న వేళ.. ఇండియన్ 2 చిత్రం వాయిదా పడొచ్చనే వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కారణం ప్రభాస్ కల్కి జూన్ 27 న రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇండియన్ 2 ని జూన్ 13 న విడుదల చేద్దామనుకున్నా.. కల్కి విడుదలకి కేవలం రెండు వారాలే గ్యాప్ ఉంటుంది.

కల్కి లో కూడా కమల్ హాసన్ నటిస్తుండడంతో కేవలం రెండు వారాల గ్యాప్ లో కమల్ సినిమాలు రావడం కరెక్ట్ కాదని చాలా మంది బయ్యర్లు మేకర్స్ కు సజ్జెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొద్దిగా పెండింగ్ ఉండడంతో అన్ని విధాలుగా ఆలోచించే జూన్ నుంచి ఇండియన్ 2 ని పోస్ట్ పోన్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తోంది.

Kamal back step because of Prabhas..:

Kamal Haasan and Shankar Indian 2 release postponed

Tags:   KAMAL HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ