Advertisementt

పుష్ప విలన్ ఆవేశం ఓటీటీ డేట్

Sun 05th May 2024 08:53 PM
fahadh faasil  పుష్ప విలన్ ఆవేశం ఓటీటీ డేట్
Aavesham OTT Streaming Date పుష్ప విలన్ ఆవేశం ఓటీటీ డేట్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా ఫిలిం పుష్ప చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ గా విలన్ రోల్ పోషించిన ఫహద్ ఫాసిల్ హీరోగానూ, స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ కేరెక్టర్స్ లో నటిస్తూ అదరగొట్టేస్తారు. ఆయన కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో చేసిన కేరెక్టర్ కి పాన్ ఇండియా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో మలయాళంలో నటించిన ఆవేశం ఏకంగా రూ. 130 కోట్లు కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

గ్యాంగ్ స్టర్ రంగ పాత్రలో ఆవేశంలో ఫహాద్ ఫాసిల్ అదరగొట్టేసారు. ఈ చిత్రం మళయాళంలో పెద్ద హిట్ అయ్యింది. అయితే ఆవేశం చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడలో డబ్ చేస్తారనుకుంటే.. అదేమీ జరగలేదు, ఇప్పుడు ఈ చిత్రం అనుకున్నదాని కన్నా ముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైందనే న్యూస్ వైరల్ గా మారింది.

ఫహద్ ఫాసిల్ ఆవేశం చిత్రం ఓటీటీ హక్కులు ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని మే 9 నుంచి పాన్ ఇండియాలోని పలు భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.. వచ్చే వారమే ఈ చిత్రం ఓటీటీలోకి  వస్తుంది అని దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Aavesham OTT Streaming Date :

Fahadh Faasil Blockbuster Aavesham Arriving On OTT

Tags:   FAHADH FAASIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ