గీతాంజలి చిత్రంతో సక్సెస్ అందుకున్న అంజలి.. మరోసారి గీతాంజలి సీక్వెల్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటూ తెలుగు ప్రేక్షకులని పలకరించింది. గీతాంజలి చిత్రం తర్వాత ఆమె నటించిన చిత్రాలు వరసగా అంజలిని డిస్పాయింట్ చేస్తూనే ఉన్నాయి. గీతాంజలి మళ్ళీ వచ్చింది అయినా అంజలిని ఆదుకుంటుంది అనుకుంటే అది కూడా అంజలికి నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం అంజలి హోప్స్ మొత్తం రామ్ చరణ్-శంకర్ ల గేమ్ ఛేంజర్ పైనే ఉంది. ఆ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా ఫిలిం గనక.. అంజలి మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ వుంది. ఇంతలోపులో అంజలి సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టింది.
కొన్నాళ్లుగా సోషల్ మీడియాని పక్కన పెట్టిన అంజలి మళ్ళీ యాక్టీవ్ అయ్యింది. కొద్దిరోజులుగా అంజలి ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. మోడ్రెన్ డ్రెస్సులు, ట్రాన్సపరెంట్ శారీస్ తో అంజలి అందాలు ఆరబోసే పనిలో ఉంది అనే కన్నా.. అందాలు చూపించి చూపించనట్టుగా చూపిస్తూ కవ్విస్తుంది. ప్రస్తుతం అందరూ అంజలి స్పెషల్ షూట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.