Advertisementt

కొడాలి నాని, వంశీలకు ఘోర ఓటమే..!

Sun 05th May 2024 03:34 PM
vamsi  కొడాలి నాని, వంశీలకు ఘోర ఓటమే..!
Bad defeat for Kodali Nani and Vamsi..! కొడాలి నాని, వంశీలకు ఘోర ఓటమే..!
Advertisement

కొడాలి నాని.. వల్లభనేని వంశీ ఔట్!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఇక కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో నేతలు అస్త్రశస్త్రాలు బయటికి తీస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందేనని వైసీపీ.. తగ్గేదేలే ముఖ్యమంత్రి పీఠం మాదేనని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ధీమాగా ఉంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలేలా.. టీడీపీకి అదిరిపోయే శుభవార్త ఓ సర్వే సంస్థ చెప్పింది. అదేమిటంటే.. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి బరిలో ఉన్న వల్లభనేని వంశీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోబోతున్నారట. ఇప్పుడిదే ఉమ్మడి కృష్ణాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

అవునా.. నిజమా..!?

ఏపీలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ గెలవడం అంత ఆషామాషీ ఏం కాదు. ఎందుకంటే.. ఒకటా రెండా సవాలక్ష తప్పులు, అనాలోచిత నిర్ణయాలు, అవినీతి.. అభివృద్ధి లేమి.. రాజధాని లేకపోవడం ఇలా చాలానే కారణాలున్నాయి. దీంతో కాకలు తీరిన నేతలే ఘోరంగా ఓడిపోతున్నారన్నది తాజాగా సర్వేలో తేలింది. ఇందులో కొడాలి నాని.. వల్లభనేని వంశీ ఉన్నారు. తెలుగులో ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఈ షాకింగ్ విషయం తేలింది. భారీ మెజార్టీతో గెలుస్తారని భావించిన వైసీపీ ఈ సర్వేతో కంగుతిన్నది. ఇందుకు చాలానే కారణాలున్నాయని సర్వేలే తేలింది.

ఎందుకిలా..?

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని.. మంత్రిగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే.. నియోజకవర్గానికి మాత్రం చేసిందేమీ లేదని.. ఎంతసేపూ రౌడీయిజం, గడ్డం గ్యాంగ్‌లను మెయింటైన్ చేయడం తప్ప చేసిందేమీ లేదట. మరీ ముఖ్యంగా.. గుడివాడను జూదశాలగా మార్చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఎంతసేపూ బూతులు తప్ప ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసింది శూన్యమని తేలిపోయింది. నియోజకవర్గంలో కనీసం తాగునీరు.. సాగు నీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగిన వెనిగండ్ల రాము.. ట్యాంకర్ల ద్వారా నీటిని ఇవ్వడంతో కాసింత ప్లస్ అయ్యిందట. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా కేసినో సంస్కృతిని తొలిసారి దిగుమతి చేసుకున్న పట్టణంగా గుడివాడ నిలిచిపోవడం గమనార్హం. చూశారుగా.. అభివృద్ధి లేదు కానీ.. కేశినో మాత్రం వచ్చేసిందంటే నాని దేనికి ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు.. ఇప్పటి వరకూ నానికి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తిని పక్కనెట్టిన టీడీపీ.. ఈసారి ఎన్నారై అయిన వెనిగండ్ల రామును బరిలోకి దింపడంతో టఫ్ ఫైట్ అయ్యింది.

వంశీకి ఇదే మైనస్!

ఇక వంశీ విషయానికొస్తే.. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వంశీ ఏ రోజూ క్యాడర్‌ను పట్టించుకున్న పాపాన పోలేదని ఇదే అతిపెద్ద మైనస్‌గా మారిందట. ఎందుకంటే.. పార్టీ మారిన తర్వాత తనతో వచ్చిన కేడర్‌తో పాటు వైసీపీ కార్యకర్తలను చూసుకోవాలి కానీ.. ఆయన మాత్రం ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారట. పైగా వైసీపీ కీలక నేతలైన దుట్టా రామచంద్రరావు నుంచి ఎలాంటి సపోర్టు లేదట. నాడు వైసీపీ నుంచి పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు.. ఇప్పుడు టీడీపీలో చేరి ప్రత్యర్థిగా మారారు. ఏ కేడర్‌ను అయితే వంశీ నిర్లక్ష్యం చేసి.. కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో వారిని అక్కున చేర్చుకున్నారట ఇదే యార్లగడ్డకు పెద్ద ప్లస్ అట. ఊహించిన దాని కంటే ఎక్కువ మెజార్టీతోనే యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము గెలవబోతున్నారట. ఈ సర్వే ఏ మాత్రం నిజమవుతుందో చూడాలి మరి.

Bad defeat for Kodali Nani and Vamsi..!:

This is the minus for Vamsi and Kodali Nani

Tags:   VAMSI
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement