గత రెండు మూడు నెలలుగా థియేటర్స్ లో నిరాశ పరిచే సినిమాలు తప్ప ఇంట్రెస్టింగ్ సినిమాలేవీ విడుదల కావడం లేదు. టిల్లు స్క్వేర్ తర్వాత చాలా సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేదు. పెద్ద సినిమాలేవీ వేసవిలో విడుదల కాకపోవడంతో చిన్న సినిమాల జాతర కనిపిస్తుంది. కాని అవేమి ఇంట్రెస్టింగ్ లేకపోవడంతో సమ్మర్ మరీ చప్పగా సాగుతుంది.
గత వారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో సుహాస్ ప్రసన్నవదనం బావుంది అనిపించినా ఆ సినిమాని థియేటర్స్ కి వెళ్లి వీక్షించేంత సీన్ ప్రేక్షకులకి లేదు. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమా అయితే అల్లరి అభిమానులని డిస్పాయింట్ చేసింది. వరలక్ష్మి శబరి చిత్రం వీక్ రిపోర్ట్స్ తో తేలిపోయింది. ఇక మరో డబ్బింగ్ మూవీ బాక్ టాక్ బావున్నా దానిని తెలుగు ప్రేక్షకులు పటించుకోవడం లేదు.
ప్రస్తుతం థియేటర్స్ లో పరిస్థితి అలా ఉంటే.. ఓటీటీలో మాత్రం ఈరోజు క్రేజీ బ్లాక్ బస్టర్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ అయ్యి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్ అయ్యి థియేటర్స్ లో విడుదలై పాన్ ఇండియా భాషల్లోనూ సక్సెస్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ ఆడియన్స్ ముందు వచ్చింది.
థియేటర్స్ లో బోర్ కొట్టినా ఓటీటీలో మంజుమ్మెల్ బాయ్స్ చూస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లో రిలాక్స్ అవుతున్నారు. మరోపక్క మలయాళం నయట్టు రీమేక్ కోట బొమ్మాలి పీఎస్ ఈ రోజు ఆదివారం స్టార్ మా నుంచి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులని పలకరించబోతుంది.